Header Banner

ఢిల్లీలో జరిగిన గంటల చర్చలు.. కీలక నిర్ణయాలు ! వాటికి ఓకే చెప్పిన మోదీ!

  Sat Apr 26, 2025 08:32        Politics

అమరావతి పునర్నిర్మాణానికి ప్రధాని మోదీని ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, అభివృద్ధి ప్రాజెక్టులపై వారితో విస్తృతంగా చర్చించారు. మియావాకీ విధానంతో పచ్చదనం పెంపు, ఉగ్రవాదంపై కఠిన నిర్ణయాలకు మద్దతు వంటి అంశాలపై ప్రధానితో  చర్చించారు.

 

‘అద్భుతమైన భవిష్యత్‌ దిశగా రాష్ట్రం జరిపే ప్రయాణంలో అమరావతి చరిత్రాత్మక మైలురాయి అవుతుంది. ఈ ప్రత్యేక ఘట్టాన్ని ప్రారంభించేందుకు, రాష్ట్రాభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని లిఖించడానికి అమరావతికి రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించాను. ఆయన అంగీకరించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి ఆయన పలు సూచనలు కూడా చేశారని వెల్లడించారు. చంద్రబాబు శుక్రవారం ఢిల్లీలో ప్రధానితో సమావేశమయ్యారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇద్దరూ దాదాపు గంటసేపు చర్చలు జరిపారు. రాజధాని నగర నిర్మాణం చేపడుతున్న తీరును, వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. పోలవరం ప్రాజెక్టు పురోగతిని, విశాఖ ఉక్కు కర్మాగారం పనితీరును వివరించారు.

 

ఇది కూడా చదవండి: వీరయ్య చౌదరి హత్య కేసులో కీలక ఆధారాలు! స్కూటీ స్వాధీనం! వారిద్దరు నిందితులుగా గుర్తింపు!



రాజధాని పనులు ప్రారంభించేందుకు తాను తప్పకుండా వస్తానని చెప్పిన మోదీ.. రాజధానిని వేగవంతంగా నిర్మించేందుకు పలు సూచనలు చేశారు. దేశంలో అనేక మౌలిక సదుపాయాలను తన ప్రభుత్వం ఎంత వేగంగా నిర్మించిందో సీఎంకు తెలియజేశారు. అమరావతిలో పచ్చదనం పెంచేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని.. జపాన్‌ వన్య శాస్త్రవేత్త అకిరా మియావకీ అనుసరించిన అటవీ మొక్కల పెంపకం పద్ధతులను అమలు చేయాలని సూచించారు. ముఖ్యంగా పట్టణాల్లో స్వయం ఆధారిత సాంద్ర అడవులను పెంచేందుకు మియావాకీ సహజ అటవీ విధానాలు తోడ్పడతాయని, జీవ వైవిధ్యానికి కూడా ఉపయోగమని పేర్కొన్నారు.



నిరంతర సాయానికి ధన్యవాదాలు..

ప్రధానిని కలిసి వచ్చాక చంద్రబాబు ‘ఎక్స్‌’లో వివరాలు పంచుకున్నారు. ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించేందుకు మోదీ దూరదృష్టితో కూడిన సూచనలు చేశారని, వాటిని అమలు చేస్తామన్నారు. ‘రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న నిరంతర సహాయానికి ప్రధానికి కృతజ్ఞతలు తెలిపాను. అలాగే ఎస్సీ వర్గీకరణకు కేంద్రం ఆమోదం తెలిపినందుకు.. ఎన్టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ, ఆర్సెలర్‌ మిట్టల్‌ నిప్పాన్‌ స్టీల్‌ ప్లాంటుకు మద్దతిచ్చినందుకు.. బీపీసీఎల్‌ రిఫైనరీ మంజూరు చేసినందుకు, ఇందులో ఆరాంకో భాగస్వామ్యాన్ని ఖరారు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశాను. ఈసారి రాష్ట్ర పర్యటనలో శ్రీశైలాన్ని కూడా సందర్శించాలని కోరాను’ అని వివరించారు. ఏపీ పర్యటన సందర్భంగా ప్రధాని ప్రకటించాల్సిన అభివృద్ధి పథకాల గురించి కూడా వారి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.

 

ఉగ్రవాదులకు గట్టిగా జవాబివ్వాలి: బాబు

పహల్‌గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడి తమకు తీవ్ర ఆందోళన కలిగించిందని, ఉగ్రవాదులకు గట్టి సమాధానమిచ్చి తీరాలని చంద్రబాబు ప్రధానితో అన్నారు. ఉగ్రవాదంపై పోరులో రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం కేంద్రానికి అండగా నిలుస్తారని.. ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పేందుకు తీసుకునే ఏ నిర్ణయానికైనా తమ పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.

 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

మరో నామినేటెడ్ పోస్ట్ లిస్ట్ రెడీ! కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎప్పుడంటే?

 

సీఎంలకు హోం మంత్రి అమిత్ షా ఫొన్.. 48 గంటల లోపు.. ఎందుకంటే.!

 

మహిళలకు ప్రభుత్వం శుభవార్త.. 2-3 రోజుల్లో అకౌంట్లలోకి డబ్బులు.! వారికి ఇక పండగే పండగ..

 

సస్పెండ్ విషయంలో దువ్వాడ కీలక వ్యాఖ్యలు! తాను ఎప్పుడూ పార్టీకి..

 

మరోసారి బరితెగించిన వైసీపీ మూకలు..! ఏం చేశారంటే..!

 

వైసీపీ గుట్టు రట్టు! సెక్షన్లకే షాక్ ఇస్తున్న సునీల్ కుమార్ కేసులు!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త పెన్షన్లకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!

 

విశాఖలో వైసీపీకి ఊహించని షాక్! ఒకవైపు అరెస్టుల కలకలం... మరోవైపు కీలక నేతలు పార్టీకి గుడ్‌బై!

 

ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్! రాబోయే మూడు రోజులు ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన కుండపోత వర్షం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #DelhiMeetings #KeyDecisions #AmaravatiUpdates #PoliticalDevelopments #AndhraPolitics #CapitalCityIssue